నితిన్ సినిమా గురించి కామెంట్స్ చేసిన నెటిజన్లు.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరో?

జయం, దిల్, సై, గుండెజారి గల్లంతయ్యిందే వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితం నితిన్ నటించిన భీష్మ సినిమా కూడ మంచి హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత నితిన్ నటించిన రంగ్ దే, చెక్, మాస్ట్రో వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

భీష్మ సక్సెస్ తర్వాత నితిన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలో మొదటిసారిగా నితిన్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ఇప్పటికే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమా జూలై 8 వ తేది విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమా గురించి ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎందుకయ్యా ఈ పొలిటికల్ కామెడీ సినిమాలు అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి స్పందించిన నితిన్ అదిరిపోయే సమధానం ఇచ్చాడు. ఈ సంధర్భంగా నితిన్ స్పందిస్తూ.. ఫేక్ రాజ చిల్ అవ్వు.. ఈ సారి ఈ సినిమాతో గట్టిగా కొడదాం. ఈ ట్వీట్ స్టోర్ చేస్కో అంటూ దిమ్మ తిరిగే సమధానం ఇచ్చాడు. దీంతో నితిన్ కి ఈ సినిమా దర్శకుడు మీద చాలా నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది. జూలై 8 న విడుదల కాబోయే ఈ సినిమా నితిన్ ఊహించినట్టుగా హీట్ అవుతుందా..లేక ఈ సినిమా కూడా ప్రేక్షకులని నిరాశ పరుస్తుందో చూడాలి మరి.