Shanmukh- Jaswanth: టైటిల్ కాదు ఎలా ఆడామన్నది ముఖ్యం అంటూ వేదిక పై సెటైర్లు వేసిన షన్ను.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Shanmukh- Jaswanth: సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ దక్కించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముక్ ఈసారి కచ్చితంగా ఇతనే టైటిల్ అందుకుంటారు అంటూ పెద్ద ఎత్తున అభిప్రాయపడ్డారు. అయితే బిగ్ బాస్ ట్రోఫీ అందుకోవడానికి అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఆయన విన్నర్ గా కాకుండా రన్నర్ గా నిలిచారు అంటే అందుకు కారణం అతని వ్యవహార శైలి అని చెప్పవచ్చు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో సిరితో కలిసి షణ్ముఖ్ చేసిన రొమాన్స్ అతనిని ట్రోఫీకి దూరం పెట్టిందని చెప్పవచ్చు.

ఇకపోతే ఆదివారం బిగ్ బాస్ ఫినాలే ముగియడంతో ఈ సీజన్ లో విజేతగా సన్నీ నిలబడ్డారు. రన్నర్ గా షణ్ముక్ నిలబడ్డారు. ఇక బిగ్ బాస్ విజేతను ప్రకటించిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ బిగ్ బాస్ వేదిక పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ మనం టైటిల్ గెలిచామా లేదా అన్నది ముఖ్యం కాదు ఎలా ఆడాము అనేది ముఖ్యం అంటూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టడంతో పెద్దఎత్తున నెటిజన్లు అతనిని ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా బిగ్ బాస్ వేదికపై షణ్ముఖ్ జస్వంత్ గెలవడం ముఖ్యం కాదు అంటూ చెప్పడంతో నెటిజన్లు స్పందిస్తూ మరి ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో దేనికోసం ఉన్నావు.. ఆ ఆట మొత్తం విన్నింగ్ కోసం కాకుండా సిరితో హగ్గింగ్ కోసం ఉన్నావా అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. టైటిల్ చేజారిపోయిన కూడా హుందాగా మాట్లాడడం పోయి ఇలా మాట్లాడటం తో షణ్ముఖ్ వ్యక్తిత్వం మరింత దిగజారి పోయిందని ఇదే ప్రవర్తనను ఇలాగే కొనసాగితే తను ముందు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.