Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీ వల్లి అనే పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నేడు విడుదల అయ్యింది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ వేడుకలో భాగంగా రష్మిక మాట్లాడుతూ కాస్త ఓవర్ యాక్షన్ చేసిందని పెద్దఎత్తున నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అలాగే ఈ సినిమా కోసం తను చిత్తూరు భాషను ఎంతో కష్టపడి నేర్చుకున్నానని తెలిపిన రష్మిక కన్నడలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి సమయం దొరకలేదని తెలిపారు.
నటి రష్మిక మాతృభాష కన్నడ అయినప్పటికీ తనకు కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పడానికి సమయం దొరకలేదని చెప్పడంతో పెద్దఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కష్టపడి చిత్తూరు యాస నేర్చుకోవడానికి సమయం ఉంది కానీ మాతృభాషలో డబ్బింగ్ చెప్పడానికి సమయం లేదా నీకు అంటూ పెద్ద ఎత్తున ఈమెపై నెటిజన్లు దాడికి దిగారు.ఇక కన్నడలో డబ్బింగ్ చెప్పుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని అల్లు అర్జున్ వివరించినప్పటికీ ఈమె పై ట్రోల్స్ ఆగడం లేదు.
ఈ విషయంలో రష్మిక బహిరంగంగా కన్నడ అభిమానులకు క్షమాపణలు చెప్పి పుష్ప రెండవ పార్ట్ కి డబ్బింగ్ చెబుతానంటున్న మాట ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రమే ఈమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఏదిఏమైనా రష్మిక అత్యుత్సాహం చివరికి తనకి మెడకే చుట్టుకుందని ఈ సందర్భంగా చెప్పవచ్చు.