వయసైపోయిందంటూ అనసూయను భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు యాంకర్ గా బిల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ మరొకవైపు నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఈ టీవీ షో లో సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ తన అందాలతో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతివారం అనసూయ తన అందాలను ఆరబోస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

టీవి షోస్ కోసం గ్లామరస్ గా తయారయ్యి ఫోటో షూట్ చేయించుకుంటున్న అనసూయ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ పొట్టి బట్టలు వేసుకొని అందాలు కనిపించేలా ఫోటోలు దిగుతూ ఎన్నో సార్లు విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంతవరకు నిరాశ చెందారు. ఈ ఫోటోలలో అనసూయ అందంగా కనిపించటం అటుంచితే ముసలిదానిలా కనిపిస్తోంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఫోటోలలో అనసూయా డ్రెస్సింగ్ తో పాటు ఆమె హెయిర్ స్టైల్, మేకప్ ఆమెకి సెట్ అవ్వలేదు. ఈ ఫోటోలలో అనసూయ ముఖం మీద ముడతలు బాగా కనిపిస్తున్నాయి. దీంతో కొంతమంది నెటిజన్స్ వయసు అయిపోయింది, ముసలిదానిలా కనిపిస్తున్నావు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికి అనసూయ ఈ విషయంపై స్పందించలేదు. మరి ఈ ట్రోలింగ్స్ గురించి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.