వామ్మో మరోసారి నిహారీకను టార్గెట్ చేసిన నెటిజెన్స్.. నీకన్నా వాళ్ళే బెటర్!

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు కూతురుగా మాత్రమే కాకుండా నటిగా కూడా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. నిహారిక మెగా కుటుంబం పద్ధతులను అతిక్రమిస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొట్టమొదటి అమ్మాయిగా వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో నిహారిక మీద మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల నిహారిక రాడిసాన్ పబ్ లో జరిగిన దాడుల్లో పోలీసులకు పట్టుబడింది. దీంతో నిహారిక మరొకసారి వార్తల్లో నిలిచిన మెగా అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి పాడు పనులు ఏంటి అంటూ నిహారిక మీద మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్న నిహారి కొంత ఉపశమనం కోసం భర్త చైతన్యతో కలిసి జోర్డాన్ వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసింది. అయితే నిహారిక తన భర్తతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో నిహారిక విడాకుల గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది.

అప్పటినుండి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ.. వాటికి నిర్మాతగా కూడ వ్యవరిస్తుంది. ఇటీవల నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫోటో చూసిన నెటిజన్లు నిహరికని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలో నిహారిక ఎరుపురంగు దుస్తులలో, పొట్టి జుట్టుతో ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో చూసి నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నీకన్నా అడక్కు తినే వాళ్ళు బాగుంటారని కొందరి కామెంట్స్ చేస్తే.. గ్రహాంతర వాసి కప్పలా ఉన్నావు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పబ్ లో పట్టుపడినప్పటి నుండి ఈమెను డ్రగ్స్ క్వీన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.