టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అయాన్, అర్హ అని ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ కూతురు టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అతి చిన్న వయసులోనే సమంత నటించిన శాకుంతలం చిత్రంలో నటించింది. నాలుగున్నర సంవత్సరాల వయసున్న అర్హ తన ప్రతిభతో చెస్‌లో దూసుకెళ్తోంది. అంతేకాదు అతి చిన్న వయసులోనే నోబుల్ అవార్డు కూడా అందుకుంది.
ఇటీవల అర్హ తన తాతతో కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో నీ పేరేంటి అని అడగ్గా.. అల్లు అర్హ రెడ్డి అని చెప్పింది. అల్లు అర్జున్ కూతురు అలా చెప్పటంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. సాధారణంగా పిల్లలు తన తండ్రి సామాజిక వర్గానికి చెంది తండ్రి ఇంటిపేరు పెట్టుకుంటారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కాపు సామాజికవర్గానికి చెందిన వాడు. స్నేహ రెడ్డీ సామాజిక వర్గానికి చెందినది. అర్హ మాత్రం ఇటు తండ్రి ఇంటిపేరుతో పాటు తల్లి పేరులో ఉన్న రెడ్డి కలిపి అల్లు అర్హ రెడ్డీ అని పెట్టుకుంది.
అయితే బన్నీ కూతురు అలా తన పేరు అల్లు అర్హ రెడ్డి అని చెప్పటంతో చిన్న వయసునుండే పిల్లలను కులాల ఊబిలోకి నెట్టుతున్నారు. ఇది సరైన పద్దతి కాదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సమాజంలో చాలామంది తల్లితండ్రులు పిల్లల్ని ఇలా కులాల పేరు చెప్పి వారికి సామాజిక శ్రేయస్సు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కుల, మత భేదాలు లేకుండా అందరూ సమానమే అన్న భావనతో పెంచటం సమాజానికి శ్రేయస్కరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.