మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిహారిక చేసే అల్లరి గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక ఒకే విధంగా ఉంది. నిహారిక అభిమానులు ఆమెను డ్యాషింగ్ గర్ల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ రాకూడదు అన్న నియమాన్ని చేయించి మరి హీరోయిన్ గా రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఊహించిన విధంగా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.
ఇకపోతే మొన్నటి వరకు నిహారిక పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరొక విషయం లో సోషల్ మీడియాలో నిలిచింది నిహారిక. కొందరు నెటిజెన్స్ ఆమెను ట్రోలింగ్స్ చేస్తున్నారు. తాజాగా నిహారిక విదేశీ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలను బట్టి చూస్తే ఆమె జోర్డాన్ దేశంలో వెకేషన్ ను ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో నిహారిక షార్ట్ ఫ్రాక్ లో కనిపించింది. అంతేకాకుండా గాగుల్స్ పెట్టుకొని సూపర్ హాట్ స్టైలిష్ గా కూడా కనిపించింది. ఈ ఫోటోలో పై స్పందించిన పలువురు సెలబ్రిటీలు వావ్, సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ఆమె ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై దాడికి దిగారు. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ.. నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురవుతోంది. దీంతో మెగా అభిమానులు నిహారిక పదే పదే ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురి అయ్యి మెగా పరువు తీస్తోంది అంటూ మండిపడుతున్నారు. కానీ నిహారిక విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా..మై లైఫ్, మై రూల్స్ అంటూ ముందుకు సాగిపోతోంది.