నిహారిక కొణిదెల ఈ పేరు గురించి అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలోకి నిహారిక అడుగుపెట్టారు.ఈ విధంగా కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఇలా పలు సినిమాల్లో నటించినప్పటికీ నిహారిక పెద్దగా గుర్తింపు పొందలేదు అని చెప్పాలి.ఈమె పలు సినిమాలలో నటించి అనంతరం జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత నిహారిక పలు వివాదాలలో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైనా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణమయ్యాయి.తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో గురించే తీవ్ర స్థాయిలో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు ఎదురవడంతో ఈమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఈ విషయం మర్చిపోకముందే మరోసారి పబ్ లో పోలీసులకు దొరికిపోయారు.ఇలా ఈ వ్యవహారం నుంచి బయటపడిన నిహారిక ప్రస్తుతం తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు అక్కడ కూడా డ్రగ్స్ దొరుకుతాయా…ఇక్కడ అయితే దొరికిపోతావ్ అని అక్కడికి వెళ్ళావా అంటూ దారుణంగా నిహారికను టార్గెట్ చేసి తనపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా నువ్వు కూడా సమంత బాటలోనే పయనిస్తున్నావని సమంతతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిహారిక ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెటిజన్లకు టార్గెట్ అయ్యారనే చెప్పాలి.