Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఆడియో ఫంక్షన్ లోనే ఫ్యాన్స్ తో అభ్యంతరకర పదాలు అనిపించారు. అయినా ఈ యువ హీరో క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ రష్మిక మధ్యలో ఏదో ఉందనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది అయితే ఈ విషయాన్ని వీళ్లిదరు ఒప్పుకోలేదు, ఖండించనూ లేదు. దీంతో వీళ్ల మధ్యలో రిలేషన్ ఉందనే మీడియా నమ్మింది. వీళ్ళు డిన్నర్ డేట్స్ కి తిరగడం, విజయ్ ఫ్యామిలీ ట్రిప్ లో రష్మిక ఉండటం తో మీడియా అనుమానాలు బలపడ్డాయి.
రీసెంట్ గా నేషనల్ మీడియా కూడా వీళ్ల మధ్యలో రిలేషన్ నిజమే అని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రాసేసారు. ఈ విషయం పై విజయ్ స్పందిస్తూ ఎప్పటిలాగానే చెత్త వార్తలు,నాన్ సెన్స్ అంటూ తిడుతూ రాయలేనటువంటి బూతు అర్థం వచ్చే పదాలు అన్నారు. ఇలా అయినా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇక ఈ పోస్ట్ బాగా ట్రోల్ కి గురైంది. చాలా మంది నెటిజన్స్ అభ్యంతరకర బాష ఒక హీరో మాట్లాడటం ఏమిటని అది కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట తీరు పై ఎంత మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే విజయ్ పూరి సినిమా లైగర్ తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కూడా పూరి డైరెక్షన్ లోనే జనగణమన అనే సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.