Big Boss Season6: బిగ్ బాస్ కి వెళ్లి ఫ్రీడమ్ పోగొట్టుకోవద్దంటూ యూట్యూబర్ కి సలహా ఇస్తున్న నెటిజన్స్…!

Big Boss Season 6: బిగ్ బాస్ రియాలిటీ షోఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఓటీటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజర్ కూడా ఇటీవల ముగిసింది. ఈ సీజన్ లో బిందుమాధవి టైటిల్ సొంతం చేసుకొని బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బిగ్ బస్ సీజన్ 6 గురించిన వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఈ బిగ్ బాస్ సీజన్ 6 జూన్ నెలాఖరిలో లేదా జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పలువురు టీవీ ఆర్టిస్టులు, యాంకర్ ల తో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఉన్న టాప్ 7 కంటెస్టెంట్ లలో ఇద్దరు కచ్చితంగా ఈ సీజన్ లో కనిపించనున్నారు. వారు మరెవరో కాదు యాంకర్ శివ, మిత్రా శర్మ. యాంకర్ శివ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం కల్పించమని ఏకంగా నాగార్జున గారిని నాన్ స్టాప్ సీజన్ గ్రాండ్ ఫినాలే రోజున స్టేజి మీదే అడిగేశాడు. దీంతో ఈ సీజన్ 6 లో శివకి అవకాశం ఇచ్చారు. ఇక వీరితో పాటు మరోక పేరు కూడా విపిస్తుంది.

సోషియల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తో టాప్ లో ఉన్న హర్ష సాయి కూడా బిగ్ బాస్ లో కనిపించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హర్ష సాయి మరెవరో కాదు.. అతి తక్కువ కాలంలోనే సోషియల్ మీడియాలో 4.72 మిలియన్ల ఫాలోవర్ల తో టాప్ లో ఉన్నాడు. దీంతో హర్ష సాయికి ఉన్న ఫాలోయింగ్ వల్ల అతడు కూడ బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు ఫ్రీడమ్ ను కోరుకునే హర్ష సాయి బిగ్ బాస్ కి వెళ్లి ఆ ఫ్రీడమ్ పోగొట్టుకో వద్దని అతని సన్నిహితులతో అన్నట్టు సమాచారం. అయితే హర్ష సాయి అభిమానులు, నెటిజన్స్ నువ్వు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళాద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్లి నీ ఫ్రీడమ్ పోగొట్టుకోవద్దు అంటూ హర్ష సాయికి సూచనలు ఇస్తున్నారు.