తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూనమ్ హీరోయిన్ గా నటించింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ, సినిమాలలో రాని గుర్తింపు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పోస్టులు పెద్ద ఎత్తున నెటిజనులు ఈమెనూ దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన చివరిలో #PKLOVE అని హ్యాష్ ట్యాగ్ ఉంటుంది.ఇక ఈమె నటుడు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్లాడిన మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ చాలామంది ఈమె పై ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజన్ ఈమెకు ట్వీట్ చేస్తూ ప్రతి ట్వీట్ చివర PK Love అని ఉంటుంది పీకే అంటే ఎవరు అక్క అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు పూనమ్ స్పందిస్తూ అదిరిపోయే సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఎలాంటి కారణం లేకుండా మీరు ఎప్పుడూ నన్ను టీజ్ చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటాననీ అర్థం. ఇప్పుడు అర్థమైందా తమ్ముడు అంటూ ఈమె సమాధానం చెప్పారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.