Surekha Vani Daughter: నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుప్రీత తన తల్లి సురేఖ వాణితో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంటారు. దీంతో ఈమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే కొన్ని సందర్భాలలో నెటిజెన్స్ చేసే కామెంట్స్, వారు అడిగే ప్రశ్నలకు సుప్రీత చాలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది.
ఇటీవల సుప్రీత సోషియల్ మీడియలో యాక్టివ్ గా ఉన్న సమయంలో తన ఫాలోయర్స్ తో ముచ్చటించింది. ఆ సమయంలో వారు అడిగే ప్రశ్నలకు కూడా అమే సమాధానాలు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లెప్పుడు అని ఒక నెటిజన్ ప్రశ్న వేశాడు. దీంతో ఆగ్రహించిన సుప్రీత… ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అంటూ మండిపడింది. సుప్రీత ప్రస్తుతం లేచింది మహిళ లోకం అనే సినిమాలో ఒక పాత్రలో నటిస్తోంది.
అయితే తన కూతురుని హీరోయిన్ గా చూడాలని సురేఖవాణి మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తోంది. తనలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కాకుండా తన కూతురు పెద్ద హీరోన్ గా గుర్తింపు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సురేఖ వాణి అభిమానులూ కూడా తన కూతురు సిని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా సుప్రీత ప్రస్తుతం నటిస్తున్న సినిమా ద్వారా ఆమెకి మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నారు.