నెట్ ఫ్లిక్స్ గురించి తెలుసు కదా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం. ఇది మన దేశానికి చెందిన ప్లాట్ ఫాం కానప్పటికీ.. ఇండియాలోనూ దీనికి యూజర్లు చాలామంది ఉన్నారు. ఇండియాలోనూ నెట్ ఫ్లిక్స్ మంచి బిజినెస్ చేస్తోంది.
అయితే.. నెట్ ఫ్లిక్స్ ప్రారంభంలో ఓ నెల పాటు ఉచితంగా ట్రయల్స్ ను అందించేది. అన్ని దేశాల యూజర్లకు అప్పుడు ఈ అవకాశం ఉండేది. కానీ.. తర్వాత నెట్ ఫ్లిక్స్ ఫేమస్ అవడంతో.. ట్రయల్ ఆఫర్ ను పూర్తిగా తీసేసింది నెట్ ఫ్లిక్స్.
తాజాగా మరోసారి నెట్ ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అది కూడా కేవలం భారత యూజర్లకు మాత్రమే. దీనికే స్ట్రీమ్ ఫెస్ట్ అనే పెరు పెట్టింది. ఈ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ను భారత యూజర్లకు డిసెంబర్ 4 నుంచి ఇవ్వనుంది.
కాకపోతే.. డిసెంబర్ 4 నుంచి కేవలం రెండు రోజులు మాత్రమే నెట్ ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ను అందించనుంది. భారత యూజర్ల.. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటే.. ఎక్కువ సంఖ్యలో నెట్ ఫ్లిక్స్ కు లాగిన్ అయితే.. ఫ్రీ ట్రయల్ ఆఫర్ ను వేరే దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
రెండు రోజుల ఫ్రీ ట్రయల్ లో ఎటువంటి కార్డు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్.. నెట్ ఫ్లిక్స్ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరి. రెండు రోజుల పాటు ఉచితంగా అమెరికన్ సిరీస్ లు, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు అన్నీ చూడొచ్చు.