Pawan Kalyan: కూటమి అనుకూల పత్రికలలో పవన్ పై దుష్ప్రచారం… పవన్ టార్గెట్ అయ్యారా?

Pawan Kalyan: సినీ నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతూ డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా గురించి నెగిటివిటీ కూడా పెరిగిపోతుంది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ వేయడంతో సినిమాకు మరింత మైనస్ గా మారిందని చెప్పాలి. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూటమి అనుకూల మీడియాలో కూడా నెగిటివిటీ రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కూటమి పార్టీలలో పవన్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. అలాంటిది ఆయన సినిమా విడుదలైన నేపథ్యంలో కూటమి అనుకూల మీడియాలో కూడా నెగిటివిటీ రావడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూటమి అనుకూల మీడియాలో నెగిటివిటీ రావడంతో రాజకీయాలు పరంగా కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారా అందుకే ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో కాస్త ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ త్వరలో రాబోయే ఓజీ సినిమాతో మాత్రం అభిమానులకు కావలసినంత స్టఫ్ ఇవ్వబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి తదుపరి సినిమాతో అయినా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.