అఖిల్ సినిమాను లైట్ తీసుకుంటారు జనం

Akhil's Most Eligible Bachelor

Akhil's Most Eligible Bachelor

అఖిల్ అక్కినేని ఎంతో ఘనంగా అక్కినేని కుటుంబం నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘అఖిల్’ సినిమాతో మాస్ హీరోగా సెటిలవుదామని అనుకున్నాడు. రొమాంటిక్ హీరోలని పేరున్న ఫ్యామిలీ ఛరీష్మాను పక్కనబెట్టి అఖిల్ చేసిన ఈ వ్యతిరేక ప్రయత్నం బెడిసికొట్టింది. సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన ‘హలో, మిస్టర్ మజ్ను’ సినిమాలూ అంతే. ఏవీ అతన్ని నిలబెట్టలేకపోయాయి. ఒకానొక దశలో అఖిల్ చాలా డీలాపడిపోయారు. ఎలాంటి సినిమా చేయాలనేది కూడ ఆయనకు క్లారిటీ లేకుండా పోయింది. ఎలాగో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చేశారు.

ఆ సినిమా కూడ అనేక కష్టాలు పడింది. ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. లాక్ డౌన్ ఒక ఎదురుదెబ్బ అయితే ఈ మితిమీరిన ఆలస్యం ఇంకో ఎదురుదెబ్బ. దీని మూలంగా అభిమానుల్లోనే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతోంది. ఎక్కడా ప్రమోషన్లు లేవు. లాక్ డౌన్ వలన ఆగిన సినిమాలు అన్నీ ఒక్కొక్కటిగా రిలీజైపోతున్నాయి. కానీ అఖిల్ సినిమానే రావట్లేదు. ఏకంగా జూన్ 19న రిలీజ్ పెట్టారు. దీన్నిబట్టి సినిమాకు ఇంకా రిపేర్లు జరుగుతున్నాయా అనే అనుమానం వస్తోంది అభిమానుల్లో. ఇది సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రమాదం లేకపోలేదు. అఖిల్ అయినా కనీసం అప్పుడప్పుడు బయట కనిపిస్తే బాగుండేది. సినిమా పాటలో, టీజర్లోకి ఏదో ఒకటి వదులుతూ జనాల్లో ఉండాల్సింది. కానీ ఆ ప్రయత్నమే చేయట్లేదు. అల్టిమేట్ గా ఈ ఎఫెక్ట్ సినిమా మీద తప్పక ఉంటుంది.