గులాం నబీ ఆజాద్‌ కి ఎన్డీయే బంపర్ .. ఏమిటంటే ?

గులాం నబీ ఆజాద్‌ .. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15న ముగియనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్‌ సేవలను కొనియాడారు.

congress dont Nominat We Reddy Athawale tells Ghulam Nabi Azad - Sakshi

అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్‌ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.

ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ ఆజాద్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయకపోతే.. తాము నామినేట్‌ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్‌ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. కాగా తొలిసారి 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్‌ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు.