Akhanda Movie: హీరో బాలకృష్ణ ఇటీవల నటించిన అఖండ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో గత ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్ లు అందుకున్న సినిమాలలో అఖండ సినిమా కూడా టాప్ లిస్టులోకి చేరింది. మొత్తంగా ఈ సినిమా దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా చరిత్రను సృష్టించింది.
అంతేకాకుండా బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమాగా వచ్చిన అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సింహా,లెజెండ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. మూడవ సారి కూడా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ ఇండస్ట్రీలోనూ బెస్ట్ కాంబినేషన్ గా గుర్తింపు అందుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను శుక్రవారం తమిళంలో కూడా విడుదల చేశారు.
శుక్రవారం తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అఖండ సినిమాను డబ్ చేసి విడుదల చేసారు. తమిళంలో ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. ఇకపోతే అఖండ సినిమాను తమిళంలో కోటి కంటే తక్కువ ధరకే అమ్మినట్లు తెలుస్తోంది. దాదాపు 65 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో ఈ సినిమా తమిళ్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కనీసం 80 లక్షల షేర్ రాబట్టిన కూడా ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకున్నట్లే. మరి కమర్షియల్ సినిమాలను అంతగా ఇష్టపడని తమిళ జనాలు అఖండ సినిమాను ఎంత వరకు సక్సెస్ చేస్తారో చూడాలి మరి.