నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ నటి నజ్రియా నజీమ్ నటించింది. తమిళ్ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన నజ్రియా నజీమ్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఇది. రాజా రాణి సినిమాలో కూడా నటించి అందరి మన్ననలు పొందింది. ఈ సినిమ తమిళ భాషలో తెరకెక్కించినప్పటికీ తెలుగులో డబ్బింగ్ చెప్పి తెలుగులో కూడా విడుదల చేశారు. దీంతో రాజా రాణి సినిమా ద్వారా నజ్రియా నజీమ్ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే. కానీ ఈమె మొదటిసారిగా తెలుగులో నటించిన సినిమా మాత్రం అంటే సుందరానికి.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 10 వ తేదీ తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన నాటి నుండి మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సుందర్ పాత్రలో నాని నటించగా..లీల పాత్రలో నజ్రియా నజిమ్ నటించింది. ఈ రెండు పాత్రలు వీరికి బాగా సెట్ అయ్యాయి. ఈ సినిమాలో నరేశ్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకీ సంబందించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో లీల పాత్రలో నటించినందుకు నజ్రియా నజీమ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని అంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా కోసం నజ్రియా నజీమ్ రెండు కోట్లు రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం నజ్రియా స్వయంగా తానే డబ్బింగ్ చెప్పింది. తమిళ, కన్నడ భాషలలో కొన్ని సినిమాలలో నటించిన తర్వాత మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ ని పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరమయ్యింది. కానీ అంటే సుందరానికి కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా నజ్రియా భర్త ఫాహద్ ఫాజిల్ కూడా పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకని బాగా ఆకట్టుకున్నాడు.