మొదటిసారిగా భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న నయనతార?

గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న నయనతార తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి ఎన్నో దేశవిదేశాలలో తిరుగుతూ ప్రేమలో విహరించారు.ఈ విధంగా ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియుడితో కలిసి ఈమె విదేశీ పర్యటనలకు వెళ్లడమే కాకుండా ఎన్నో దైవ క్షేత్రాలకు కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా ప్రేమలో ఏడు సంవత్సరాల పాటు ప్రేమపక్షులు గా విహరించిన ఈ జంట జూన్ 9వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మహాబలిపురంలో ఒక రిసార్టులో వీరి వివాహం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.

ఇకపోతే వివాహమైన వెంటనే ఈ జంట భార్యాభర్తలుగా మరోసారి దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నయనతార తన భర్త విగ్నేష్ కలిసి దంపతులుగా తిరుపతి శ్రీవారి సన్నిధికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఈ దంపతులు స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. కొత్త జంటకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం ముగిసన తర్వాత కొత్త జంటకు స్వామివారి తీర్థప్రసాదాలతో ఆలయ అర్చకులు సత్కరించారు.

ఈ విధంగా వివాహమైన తర్వాత భార్య భర్తలుగా ఈ దంపతులు మొదటిసారిగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు స్టార్ సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. ఇక 11వ తేదీ చెన్నైలో జరగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి లక్షల్లో సినీ సెలబ్రిటీలు బంధుమిత్రులు తరలి రానున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమాలను కూడా ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి.