ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి కొంతకాలం వరకు తెలుగు ప్రజలకు పరిచయం లేదు. కానీ నయనతారతో ప్రేమ వ్యవహారం ఉండటంతో విగ్నేష్ తెలుగు ప్రజలకు కూడా సుపరిచితులయ్యారు. తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన విగ్నేష్ శివన్.. ఆయన దర్శకత్వం వహించిన నేనూ రౌడీనే, గ్యాంగ్, కేఆర్‌కే లాంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు . చాలా కాలం నయనతారతో ప్రేమలో ఉన్న విగ్నేష్ శివన్ ఇటీవల ఆమెతో కలిసి వివాహబంధంలోకి అడుగు పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
ఇదిలా ఉండగా ఇటీవల విగ్నేష్ శివన్ ఒక అరదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. తమిళనాడు సీఎం స్టాలిన్ ని డైరెక్ట్ చేసే అవకాశం విగ్నేష్ శివన్ దక్కించుకున్నాడు. అసలు స్టాలిన్ ఏదైనా కొత్త సినిమాలో నటిస్తున్నాడా? అనుమానపడుతున్నరా? కాదండీ అసలు విషయం ఏమిటంటే చెన్నైలో జులై 28 నుంచి ఆగస్ట్ 10 వరకు చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగనున్నాయి. ఈ చెస్ పోటీలలో దాదాపు 186 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది చెస్ క్రీడాకారులు పాల్గొననున్నారు. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం ఈ చెస్ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.ఈ క్రమంలో చెస్ పోటీలను ఒక స్పెషల్ వీడియోను రూపొందించాలని ప్రభుత్వం భావించింది.
అయితే ఆ బాధ్యతలను స్టాలిన్ ప్రభుత్వం విఘ్నేష్ శివన్‌కు అప్పగించింది. ఈ చెస్ పోటీలకు సంబంధించిన ఈ వీడియోలో సీఎం స్టాలిన్ కూడా నటించారు. ఇటీవలే చెన్నైలో నేపియార్ దగ్గర సీఎం స్టాలిన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ చెస్ పోటీలకు సంబంధించిన వీడియోకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక వివాహం తర్వాత నయనతార తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటే విగ్నేష్ శివం కూడా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన కాదువాకుల రెండు కాదల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విగ్నేష్ ప్రస్తుతం అజిత్‌కుమార్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.