Nayanathara: అందం, అభినయంలో ఏ మాత్రం తీసిపోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి నయనతార లక్ష్మీ, తులసి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఒక పక్క హీరోయిన్ గా దూసుకుపోతూనే మరోపక్క నిర్మాతగా కెరీర్ ను లీడ్ చేస్తోంది నయనతార.
అయితే గత కొన్ని రోజులుగా తమిళ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అతనితో కలిసి దేశవిదేశాల్లో తిరుగుతూ రీసెంట్ గా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా సందడి చేశారు ఈ జంట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళుతున్న వీళ్లు, పెళ్లి ఎప్పుడు అనేదానిపై మాత్రం వారు కరెక్ట్ గా చెప్పడం లేదు. రీసెంట్ గా ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని సమాచారం. కానీ ఆ వార్తలపై వారు ఇప్పటికీ స్పందించలేదు.
ఇకపోతే కోలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ లలో ఒకరైన నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి టైం రావాలంటూనే సహజీవనం చేస్తూనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఈవెంట్ ను ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్న ఈ జంట ప్రేమ లేఖలు, చాక్లెట్లు, హాలిడే ట్రిప్ లు.. ఇలా వారి ప్రేమను చూపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రేమికుల రోజు సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడికి సర్ ప్రైజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. లేట్ నైట్ సిగ్గుపడుతూ పుష్పగుచ్చంను తన చేతిలో ఉన్న బొకేని విఘ్నేష్ కు అందిస్తూ అతన్ని కౌగిలించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విఘ్నేష్ ఓ వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. దానికి ఒక క్యాప్షన్ ని కూడా జత చేశాడు. తొలిసారి తనకు ఫ్లవర్ బొకేని అందించి నయనతార తనకు ప్రపోజ్ చేసినట్లుగా.. అంతేకాకుండా ఇదే నిజమైన వాలెంటైన్స్ డే అని విగ్నేష్ కామెంట్ చేశాడు.