కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ళలో మంచి గ్లామర్ పాత్రలు పోషించిన నయనతార గత కొంతకాలంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉండగా నయనతార వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తాజాగా ఆమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఇదివరకే నయనతార తమిళ హీరో శింబు, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్ళిన నయనతార పెళ్లి అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది. అప్పటి నుండి నయనతార ప్రభుదేవాని దూరం పెట్టింది. కొంత కాలం డిప్రెషన్ లో ఉన్న నయనతార మళ్ళీ హీరోయిన్ గా నిలదొక్కుకుని వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఈ క్రమంలో డైరెక్టర్ విగ్నేస్ శివన్ తో ప్రేమలో పడిన నయన్ కొంతకాలం ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. పెద్దల అంగీకారంతో నాలుగురోజుల క్రితం మహాబలిపురంలో ఉన్న షెరటాన్ పార్క్ గ్రాండ్ హోటల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నయనతార పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార రెండవ సారి విగ్నేష్ శివన్ తో తాళి కట్టించుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం వారి తల్లి తండ్రులు. మహాబలిపురం లో జరిగిన నయనతార పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారు. దీంతో నయన్-విగ్నేష్ దంపతులు వారి కోసం కొచ్చిన్ వెళ్లి కొంతకాలం వారితో గడిపి రెండవసారి తల్లిదండ్రులు ఎదురుగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.