Naveen Chandra: రహస్యంగా పెళ్లి చేసుకున్న నవీన్ చంద్ర…. వాలెంటెన్స్ డే సందర్భంగా బయటపెట్టిన నిజం!

Naveen Chandra: అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సందడి చేసిన నటుడు నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయన వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నవీన్ చంద్ర పరంపర వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరోకి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ఈ హీరో బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని చాలామంది భావించారు.

ఈ క్రమంలోనే ఈ హీరో ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటెన్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు వారి లైఫ్ పార్టనర్ కు అదేవిధంగా వారి ప్రియురాలికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నవీన్ చంద్ర కూడా ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చారు.ఇన్ని రోజులు బ్యాచిలర్ గా సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా నవీన్ చంద్రకు ఇదివరకే పెళ్లి అయిందని వాలెంటెన్స్ డే సందర్భంగా బయటపెట్టారు.

వాలెంటెన్స్ డే సందర్భంగా నవీన్ చంద్ర తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా అంటూ..తన భార్య పేరుతో పాటు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఎంతో షాక్ కి గురయ్యారు. ఇప్పటివరకు బ్యాచిలర్ గా ఉన్నారనుకున్న ఈ హీరో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అంటూ నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు.అయితే తనకు పెళ్లి అయిన విషయాన్ని ఎక్కడ బయట పెట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ సందర్భంగా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన నవీన్ చంద్రకు పెద్ద ఎత్తున నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.