Naveen Chandra: తెలుగు ప్రేక్షకులకు హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట అందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కానీ అందాల రాక్షసి సినిమాతో మాత్రం భారీగా అభిమానులను సంపాదించుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలలో నటించి మెప్పించారు.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే హీరో నవీన్ చంద్ర మొదట అరవింద సమేత సినిమా చేయను అని అన్నారట. ఇదే విషయాన్ని తాజాగా నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆహా కాకమ్మ కథలు షో కి గెస్ట్ గా హాజరైన నవీన్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదట నేను తేజ జై సినిమా ఆడిషన్స్ కి వచ్చాను. పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. కానీ ఆ సినిమా ఛాన్స్ రాలేదు. ఆ సినిమాకు పనిచేసిన రవి వర్మ సంభవామి యుగేయుగే సినిమాలో అవకాశం ఇచ్చారు. నాలుగేళ్ల గ్యాప్ అందాల రాక్షసి సినిమాతో స్టార్ అయిపోయాను.
కానీ వెంటనే కింద పడిపోయాను. అందుకు గల కారణం ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం. వర్క్ లేని సమయంలో రాజా రవీంద్రని మేనేజర్ ఉండమని వర్క్ ఇప్పించమని అడిగాను. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ ఛాన్స్ రాజా రవీంద్ర అనే ఇప్పించారు. మొదట ఆ క్యారెక్టర్ ను చెయ్యను అన్నాను. హీరోగా చేస్తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయను అన్నాను. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ పెద్ద సినిమా, ఆర్టిస్ట్ గా చేయాలి. ఈ సినిమాతో గుర్తింపు వస్తుంది అని చెప్పి ఒప్పించాడు. చెప్పినట్టే ఆ సినిమాతో నా లైఫ్ మారిపోయింది అని తెలిపారు నవీన్ చంద్ర. అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర బాలిరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ కి ధీటుగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.