Hardik Pandya & Natasa Stankovic: చర్చకు తెరతీసిన హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

Natasa Stankovic spotted with baby bump in instagram photos

Hardik Pandya & Natasa Stankovic: భారత డాషింగ్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా టీంలో చోటు లభించక ఇంటికే పరిమితమైపోయాడు. వెన్నుముక సర్జరీ తర్వాత తన మునుపటి ఫామ్ ని పొందలేక ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో విఫలమయ్యాడు. ఈ రోజు మొదలవబోతున్న దక్షిణాఫ్రికా సిరీస్ కి ఫిట్నెస్ ఇష్యూతో బీసీసీఐ పాండ్యాని సెలెక్ట్ చేయలేదు. దీంతో తన ఖాళీ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడిపేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక సోషల్ మీడియాలో తరుచుగా పోస్టులు చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటాడు. తాజాగా క్రిస్మస్ సందర్బంగా కుటుంబంతో సరదాగా గడిపిన ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం చర్చకు తేర తీశాయి. ఆ ఫొటోస్ లో హార్దిక్ వైఫ్ నటాసా స్టాంకోవిక్ బేబీ బంప్ తో కనిపించటమే అందుకు కారణం. నటాసా బేబీ బంప్ ని గుర్తించిన అభిమానులు కొందరు హార్దిక్ దంపతులను విష్ చేయగా మరికొందరు ట్రోల్ కూడా చేశారు. ఈ దంపతులిద్దరు గతేడాది జులై నెలలో కుమారుడు ‘అగస్త్య పాండ్యా’కు జన్మనిచ్చారు. వారి ఎంగేజ్మెంట్ అయిన ఏడు నెలలకే అగస్త్య పుట్టటడం అప్పుడు చర్చనీయాంశమైంది.

ఇక హార్దిక్ కెరీర్ విషయానికొస్తే ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పాండ్యా ని ముంబై ఫ్రాంచైజీ ఈ సారి రిటైన్ చేసుకోలేదు. త్వరలో జరగబోయే మెగా ఆక్షన్ లో ఇతగాడ్ని ఏ ఫ్రాంచైజీ ఎంత రేటుకి చేజిక్కించుకుంటుందో చూడాలి. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌ లో ఉన్నాడు. ఫిట్‌నెస్‌ ను నిరూపించుకొని త్వరలోనే ఇండియా టీంలోకి అడుగుపెడతానని పాండ్యా ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు.