బిందు మాధవి చేసిన పని గురించి అసలు నిజాలు బయటపెట్టిన నట రాజ్ మాస్టర్!

ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన నట రాజ్ మాస్టర్ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో బిందు మాధవి నటి మాస్టర్ కి మధ్య జరిగిన గొడవ కారణంగా నటరాజ్ మాస్టర్ కొంతవరకు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే హౌస్ నుండి కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిందుమాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆవకాయ్ బిర్యానీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు బంపర్ ఆఫర్, పిల్ల జమిందార్, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

అయితే సినిమా అవకాశాలు సరిగా రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిన బిందుమాధవికి అక్కడ కూడా ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో తమిళ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకుంది. తర్వాత తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సీజన్లో బిందుమాధవి మొదటి నుండి ట్రోఫీ కోసం కంటెస్టెంట్ లకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో బిందుమాధవి మాస్టర్ మధ్య గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు బిందు మాధురి బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి సారిగా లేడీ టైటిల్ విన్నర్ గా రికార్డు సృష్టించింది.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన నట రాజ్ మాస్టర్ ఆమె గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పలు ఆసక్తికర విషయాలను కూడా బయట పెడుతున్నాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ బిందు మాధవి గురించి, ఆమెని గెలిపించారని ఆమె టీమ్ చేసిన పనుల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో బిందుమాధవి చేసిన ఒక పని గురించి సీక్రెట్ బయట పెట్టాడు. బిందుమాధవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సిగరెట్ తాగి సిగరెట్ వాసన రాకుండా గుడ్డు పగలగొట్టి మేనేజ్ చేసిందన్న విషయాన్ని బయట పెట్టాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గురించి బిందుమాధవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.