శూర్పణక అంటూ బిందుమాధవి పై రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్!

బుల్లితెర మీద కామెడీ, డాన్స్ వంటి ఎన్నో రకాల రియాలిటీ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బుల్లితెర మీద ప్రసారమై మంచి ప్రేక్షకాదరణ పొందిన టీవీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటికే 5 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుత సీజన్ బుల్లితెర మీద కాకుండా ఓటిటి లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతుంది. ఈ సీజన్ మొదలై ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు దగ్గరగా ఉంది. దీంతో ఎవరు ఫైనల్ కి చేరుకుంటారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 17 మంది కంటెస్టెంట్ ల తో స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో ప్రస్తుతం బిందు మాధవి,బాబా భాస్కర్ మాస్టర్, అఖిల్, యాంకర్ శివ, నట్రాజ్ మాస్టర్, మిత్ర, అరియాన, అనిల్ కొనసాగుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో టాప్ 5 లో బిందు మాధవి, అఖిల్, నట్రాజ్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, శివ ఫినాలెలో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో మాత్రం టాప్ 5 కాకుండా టాప్ 6 ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఈ ఐదుగురి తో పాటు అరియానా , మిత్ర ఇద్దరిలో ఎవరో ఒకరు ఫినాలే కి చేరుకుంటారు. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ నామినేషన్స్ లో ఏ మాత్రం ఫైర్ తగ్గటం లేదు.

ఇటీవల వచ్చేవారం నామినేషన్స్ లో భాగంగా ఇంట్లో ఉన్న సభ్యులు ఏ ముగ్గురు ఫినాలే కి అర్హులు కారో చెప్పాలని నాగార్జున ఆదేశించాడు. దీంతో అందరూ ఊహించినట్లుగానే బిందుమాధవి నట్రాజ్ మాస్టర్, అఖిల్ , మిత్ర ఫినాలే కు అర్హులు కారని చెప్పేసింది. ఈ క్రమంలో నట్రాజ్ మాస్టర్ బిందు మాధవి మీద ఫైర్ అయ్యాడు. తెలుగు అమ్మాయికి ఉన్న ఒక్క లక్షణం కూడా నీలో లేదు. నీ వల్ల మీ నాన్న ఫెయిల్ అయ్యాడు. కనీసం ఈ వరకు కొంచెం జ్ఞానాన్ని నేర్పించండి అంటూ బిందు మాధవి తండ్రికి రిక్వెస్ట్ చేశాడు. తర్వాత నీకు పిచ్చి ముదిరింది నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా. ఎందుకు పనికిరాని పిచ్చి పిల్లి అంటూ బిందు మాధవి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో బిందుమాధవి నవ్వడంతో శూర్పణక అంటూ ఆమె మీద రెచ్చిపోయాడు.