ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉన్నా అంటూ ఎమోషనల్ అయినా నటరాజ్ మాస్టర్..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఒటిటిలో ప్రసారమవుతున్న సంగతీ అందరికి తెలిసిన విషయమే మునుపటి సీజన్ల లాగే ఈ నాన్ స్టాప్ సీజన్ కూడ బాగ పాపులర్ అయ్యింది. ఇప్పటికే 10 వారాలు పూర్తీ చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం 11 వారంలో కొనసాగుతోంది. ఇప్పటికే మునుపెన్నడూ లేని విధంగా ఈ వారంలో నామినేషన్ చాల రసవత్తరంగా సాగాయి. ప్రతివారం ఒక రోజులో పూర్తయ్యే నామినేషన్ ప్రక్రియ ఈ వారం మాత్రం రెండు రోజుల సమయం తీసుకుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిందు నట రాజ్ మాస్టర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో నటరాజ్ మాష్టర్ ఇక్కడిదాకా వచ్చాడు. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా గేమ్ ఆడుతూ ఉండే మాష్టర్ కి ఈ సారి గెలవటానికి వేరే వారి సహాయం అవసరం అయ్యింది. ఈ రోజు ప్రేక్షకులను ఓట్లు అడగటానికి అవకాశం పొందాలంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలవాల్సి ఉంటుంది. టాస్క్ లో భాగంగా పై నుండి పడే పూలను సేకరించి వారీ వద్ద ఉన్న తొట్టిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో మొదటి రౌండ్ లో నటరాజ్ మాస్టర్ ఎక్కువ పూలు సేకరించాడు. దీంతో మాష్టర్ ని ఒడించటానికి అఖిల్‌, శివ తమ వద్ద ఉన్న పూలను అనిల్‌కు ఇచ్చి అతనిని గెలిపించారు.

అఖిల్ తనకి సహాయం చేస్తాడు అనుకున్న మాష్టర్ అనిల్ కి సహాయం చేయటంతో కంటతడి పెట్టుకున్నారు. ” నాకు ఎవ్వరూ సహాయం చేయరు. కనీసం గేమ్ ఆడి ఓట్లు అడుగుదాం అనుకుంటే ఆ అవకాశం కూడ లాక్కున్నావు. ఇక్కడ ఏమి లేదు ఇంకా ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉన్నా” అంటూ ఆకాశం వంక చూస్తు కన్నీరు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి జీవిత రాజశేఖర్ అనూప్ రూబెన్స్ ఎంటర్ అయ్యారు. హౌస్ మేడ్ తో కలిసి ఈ ముగ్గురు ఎంతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.