అనాధ బాలికలకు అండగా నిలిచిన సాయం చేసిన నమ్రత!

నమ్రతా శిరోద్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా మరొక సూపర్ స్టార్ భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే.ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాలు చేయక పోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేయడమే కాకుండా మహేష్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సహాయ సహకారాలు గురించి తెలియజేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తన కుమారుడు నెలలు తక్కువగా పుట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అలాంటి ఇబ్బందులు, బాధలు ఏ తల్లి పడకూడదని మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు అండగా నిలిచి వారికి గుండె ఆపరేషన్ చేయించి పునర్జన్మను కల్పించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న నమ్రత తాజాగా అనాధ బాల బాలికల కోసం మరో సేవా కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చారు.

తాజాగా ఈమె అవగాహన ప్రచారంలో భాగంగా నంద్యాలలో BIRDS NGO నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతితో తయారు చేసిన శానిటరీ న్యాప్‌కిన్‌లను అనాధ పిల్లలకు అందించారు. ఒక మహిళగా ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈమె బాలబాలికలకు ఇలా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎంతో మంది ఈమె సహాయం పై ప్రశంసలు కురిపించారు.