స్టార్ హోటల్లో జంటగా కనిపించిన నరేష్ పవిత్ర.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య!

రమ్య, నరేష్ ఎనిమిది సంవత్సరాల క్రితమే విడిపోవడంతో నరేష్ మరొక నటితో సహజీవనం చేస్తున్నారని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ నరేష్ సహజీవనం చేస్తున్నారని వార్తలు రావడంతో వీరి వ్యవహారంలోకి నరేష్ మాజీ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే నరేష్ పవిత్ర పెళ్లి జరిగిపోయింది అంటూ ఈమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా నరేష్ నాకు విడాకులు ఇవ్వకుండా ఎలా మరో పెళ్లి చేసుకుంటారు అంటూ ఆరోపణలు చేశారు.

ఈ విధంగా గత కొద్ది రోజులుగా నరేష్ రమ్య పవిత్ర లోకేష్ మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే వివాదాల నడుమ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వారి వ్యక్తిగత విషయాలన్నింటినీ బయట పెడుతున్నారు. ఈ విధంగా రమ్య లోకేష్ నరేష్ ల వివాదం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇలా వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నరేష్ పవిత్ర లోకేష్ ఒక స్టార్ హోటల్లో రమ్య కంటపడ్డారు.

ఈ క్రమంలోనే నరేష్ తన భార్య రమ్మను చూస్తూ విజిల్ వేయడమే కాకుండా పవిత్రతో కలిసి లిఫ్టులో పైకి వెళ్లారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య ఏకంగా నటి పవిత్ర పై చెప్పుతో దాడికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు రమ్యని అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా రమ్య పవిత్ర పై చెప్పుతో దాడికే ప్రయత్నించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు వీరి మధ్య వివాదం కేవలం మాటల వరకే ఉండగా పరిస్థితి చేయి జారిపోయిందని ఇప్పుడు దాడి వరకు వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా రమ్య పవిత్ర పై దాడి చేయడంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.