Actor Naresh: భారీ మోసాలకు పాల్పడిన నరేష్ మాజీ భార్య… నాకు ఎలాంటి సంబంధం లేదన్న నటుడు నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు, విజయ నిర్మల కొడుకు నరేష్ అందరికి సుపరిచితుడు. సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈయన మాజీ భార్య ఈయన పేరు చెప్పి భారీ మోసలకు పాల్పడుతున్నారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే నరేష్ మాజీ భార్య రమ్య రఘపతి నరేష్ భార్యగా, ఫోటోలను చూపుతూ మహిళలను అధిక వడ్డీ, రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్టు బాధిత మహిళలు కేసు పెట్టారు.

రమ్య రఘుపతి, నరేష్ కు మూడో భార్య. ఇంకా రమ్య రఘుపతి కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరా రెడ్డి తమ్ముడి కూతురు. నరేష్ రమ్యను ఎనిమిదేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే విడిపోయాక కూడా నరేష్ పేరు ని వాడుకుని తనతో తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు చూపుతూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఈ విషయంపై నరేష్ స్పందించారు.

ఈ సందర్భంగా నటుడు నరేష్ మాట్లాడుతూ…..రమ్య చేసిన మోసాలకు తనకు ఎలాంటి సంబందం లేదని ప్రకటించారు. తన అప్పులకు తన ఆస్తులకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఈయన కుండ బద్దలు కొట్టినట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నరేష్ రమ్య రఘుపతి కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.