Actor Naresh: నటుడు నరేష్ కారవాన్ ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Actor Naresh: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కారవాన్ ఉపయోగించడం చూస్తుంటాం. కొంతమంది హీరోలు వారి కారవాన్ ను అభిరుచులకు తగ్గట్టుగా దీనినే రూపొందించుకున్నారు. అంటే అచ్చం వారి ఇంట్లో ఉంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలు అన్నింటిని ఇందులో అమర్చుకుంటారు. ఇంకొంత మంది హీరోలు అయితే కోట్లు ఖర్చు పెట్టి మరీ తమకూ నచ్చిన విధంగా ఆ కారవాన్ ను డిజైన్ చేసుకుంటూ ఉంటారు. హీరోలు ఏదైనా షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ వారు విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా ఉండటం కోసం షూటింగ్ వెళ్లేటప్పుడు ఈ కార్ వాన్ ను వెంటపెట్టుకుని వెళ్తారు.

ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు, పలువురు సెలబ్రిటీలకు ఇలాంటి కారవాన్ లు ఉన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా నటుడు నరేష్ కూడా అత్యాధునిక హంగులతో ఉన్న ఒక కారవాన్ ను తయారు చేయించుకున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే నరేష్ ఇంట్లో కంటే ఎక్కువగా షూటింగ్ స్పాట్ లో గడుపుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఇతర నటీనటుల కారవాన్ వాడటం మంచిది కాదు అని భావించిన నరేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన అత్యాధునిక హంగులతో కూడిన ఒక కారవాన్ ను కొనుగోలు చేశారట.

ఇక అందులో తనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేయించుకున్నారు. ఏసీ బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్ రూమ్ తోపాటు పాటు సకల సౌకర్యాలు ఉన్నాయట. ఇక ఈ కారవాన్ ను నరేష్ ముంబై నుంచి తెప్పించారట. ఇక అందుకోసం నరేష్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఈ కారవాన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.