నరేంద్ర మోదీ ప్రసంగం చెప్పగా సాగింది: తలసాని శ్రీనివాస్

తాజాగా సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో భాజపా బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ ప్రసంగం చాలా సప్పగా సాగిందని అన్నారు. ధాన్య కొనుగోలు చేశామని చెప్పటం సిగ్గుచేటని.. ఆయన రాష్ట్రానికి ఏమందించారో శ్వేత పత్రం విడుదల చేయాలి అని అన్నారు.

ఇక ఆయన హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారు అని.. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశం లో ఎక్కడ జరగడం లేదని.. భాజపా నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశం నుంచి భాజపాను తరిమికొట్టాలంటూ.. రెండు రోజులు భాజపా నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా అంటూ ప్రశ్నించారు.