అభిమానుల దెబ్బకు వెనక్కు తగ్గిన ‘నారప్ప’

Narappa team changes their mind
Narappa team changes their mind
 
విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’.  తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది రీమేక్. వెంకీ ఏరి కోరి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు.  మేకోవర్ నుండి సన్నివేశాల్లో పెర్ఫెక్షన్ వరకూ ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారు.  ఫస్ట్ లుక్ చూసి అభిమానులు థ్రిల్ ఫీలయ్యారు.  నారప్పగా వెంకీ నటనను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే కరోనా కారణంగా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకుండపోవడం, తెరుచుకున్నా తగ్గిన టికెట్ ధరలతో థియేటర్లు నడపగలమా లేదా అనే సందేహంలో ఎగ్జిబిటర్లు ఉండటంతో నిర్మాత సురేష్ బాబు ఓటీటీ విడుదలకు వెళ్లాలని అనుకున్నారు. 
 
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కులను కొనుగోలు చేసిందనే టాక్ కూడ వినబడింది.   దీంతో ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. కొందరు ఫ్యాన్స్ ఒక్కరోజు నిరాహారదీక్షలు చేస్తే ఒక మహిళా అభిమాని చేతులు కోసుకుని ‘నారప్ప’ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. మరి ఈ డిమాండ్ల మూలంగానో ఏమో కానీ సురేష్ బాబు మనసు మార్చుకున్నట్టు ఉన్నారు. సినిమాను ఓటీటీకి కాకుండా థియేటర్లలోకి వదలాలని డిసైడ్ చేసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్ సైతం మొదటి నుండి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగానే భావిస్తున్నారు.  కాబట్టి ఆయన వైపు నుండి కూడ థియేట్రికల్ రిలీజ్ కోసం ఒత్తిడి ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా ‘నారప్ప’ థియేట్రికల్ విడుదలకు వెళ్లడం హర్షించదగిన విషయం.