Nara Lokesh: తెలుగుదేశం పార్టీ యువ నేత మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అవుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024వ సంవత్సరంలో అత్యధిక మెజారిటీని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ప్రతి గ్రామ గ్రామంలోను ఈ సభ్యత్వాల నమోదును ఒక పండుగలాగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున కోటి మంది తమ సభ్యత్వాన్ని చేసుకోవడంతో నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. టీడీపీ కోటి మంది సభ్యత్వం పూర్తి చేసుకుంది. ఈ సమయాని పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో నారా లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. నాడు ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారిందని తెలిపారు. మన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహిస్తూ.. ఊరూవాడా జై టిడిపి నినాదాలతో హోరెత్తించారని చెప్పుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు విదేశాలలో ఉన్న ఎన్నారైలు సైతం ఎంతో ఉత్సాహంగా సభ్యత్వం నమోదు చేసుకున్నారని తెలిపారు.
పసుపు జెండా అంటే ఒక ఎమోషన్ అని లోకేష్ వెల్లడించారు. ఎంతోమంది పార్టీ కోసం తమ ప్రాణాలను వదులుకున్న సంగతి తెలిసిందే. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పిన జై చంద్రబాబు, జై టిడిపి అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య తనకు ప్రతి క్షణం గుర్తొస్తారని లోకేష్ తెలిపారు. ఇలా పార్టీ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు వారందరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ లోకేష్ ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.