Nara Lokesh: బొమ్మల పిచ్చితో జగన్ దేన్నీ వదలలేదు… జగన్ పై ఫైర్ అయిన నారా లోకేష్?

Nara Lokesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతల పట్ల కూటమి నేతలు చర్యలు తీసుకుంటూ ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడమే కాకుండా గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరోవైపు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలలో బలం పెంచుకునేందుకు చర్యలు కూడా చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే ఉగాది పండుగ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు ప్రతి జిల్లాలో పర్యటనలు చేస్తూ అక్కడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ లోగా గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలలోకి చేరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కూడా సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు ఎవరు కూడా హాజరు కావడం లేదు కానీ శాసనమండలిలో మాత్రం కూటమి నేతలకు వైసీపీ ఎమ్మెల్సీలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

గత పది నెలల కూటమి పాలనపై వలస ప్రశ్నలు వేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తమ గళం వినిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ ఇటీవల మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయామంలో పాఠశాలలో చదువుతున్న పిల్లలకు విద్యా కానుకలు అందజేసిన విషయం తెలిసిందే.

ఈ విద్యా కానుకలో భాగంగా పిల్లలకు పుస్తకాలతో పాటు షూస్ అలాగే స్కూల్ బ్యాగులను కూడా అందించింది అయితే ప్రతి ఒక్క నోట్ పుస్తకంపై కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండటాన్ని లోకేష్ చర్చించి విమర్శలు కురిపించారు.బ్యాగ్ తో పాటు పిల్లలకు అందించిన బెల్టులు, పుస్తకాలు, చివరికి బుక్ లెట్లపై జగన్ ఫోటో  ఉండటంతో జగన్ వారికి ఇచ్చిన కానుకల కంటే కూడా తన ఫోటోలు వేయించుకోవడం కోసమే అధిక ఖర్చు చేశారు అంటూ లోకేష్ విమర్శించారు.

జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక కిట్లు.. ఇలా ప్రతి పథకంలో దోపిడీకి దిగారని ఆరోపణలు చేశారు. ప్రచార ఆర్భాటంతో గత ఐదేళ్లు గడిపేసారని.. బొమ్మల పిచ్చితో అదనంగా ఖర్చు చేశారని.. నిధులు దుర్వినియోగం చేశారు అంటూ లోకేష్ గత ప్రభుత్వ పనితీరుపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.