Nara Lokesh: తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తాం… మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని అందరూ భావించారు కానీ ఊహించిన విధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఇలా 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పొత్తు పెట్టుకుని తెలుగుదేశం జనసేన బిజెపిలో ఎన్నికలలో పోటీ చేసి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఎవరు ఊహించని విధంగా 164 స్థానాలలో విజయం సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం వచ్చిన నేపథ్యంలో తిరిగి తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి ఫోకస్ పెట్టారు అయితే ఇప్పుడు ఆంధ్రాలో మంచి పట్టు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా తమ పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి సారించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు సీనియర్ నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కావడంతో నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాతయ్య ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

తెలంగాణలో ఇప్పటివరకు 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని, పార్టీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. పార్టీ పరంగా ప్రేమ అలాగే నమ్మకం ఉన్న నేపథ్యంలోనే 1.6 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. త్వరలోనే ఇక్కడ కూడా పార్టీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని లోకేష్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.