Nara Lokesh: దుబాయ్ క్రికెట్ స్టేడియంలో నారా లోకేష్…. ఆంధ్రాలో రాజకీయ దుమారం?

Nara Lokesh: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఈ మ్యాచ్ చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. ఇలా దుబాయ్ స్టేడియంలో లోకేష్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఇలా తన బాధ్యతలను వదిలిపెట్టి దుబాయిలో క్రికెట్ చూడటం కోసం వెళ్లడంతో ఎంతోమంది విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా వైసిపి నేతలు లోకేష్ వ్యవహార శైలి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఆదివారం ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు జరిగిన సంగతి మనకు తెలిసిందే . అయితే ఎంతో గందరగోళం నడుమ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు వ్యక్తం చేశారు. నిజానికి ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థుల కోరారు. అందుకు అనుగుణంగానే నారా లోకేష్ వ్యవహరించారు కానీ అర్ధరాత్రి కాడ యధావిధిగా పరీక్ష జరుగుతుంది అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు.

ఇలా నిరుద్యోగుల సమస్యలను ఈయన గాలికి వదిలేసి గ్రూప్ కు అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తూ లోకేష్ మాత్రం దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో నిరుద్యోగులు పోరాటం చేస్తుంటే మీరు మాత్రం అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారంటూ లోకేష్ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.