ఇటీవలే ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి హుషారు మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘దసరా’ సినిమా నాని కెరీర్‌లో మైలు రాయి అని చెప్పొచ్చు. భారీ వసూళ్లు కొల్లగొట్టడమే కాకుండా, నటుడిగా నానిని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘దసరా’తో తెచ్చుకున్న ఇమేజ్‌ని పది కాలాల పాటు పదిలంగా వుంచుకోవాలనుకుంటున్నాడట నాని.
దాంతో, తదుపరి చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులేస్తున్నాడట. అంతేకాదు, ‘దసరా’ తర్వాత నాని చేస్తున్న సినిమాల బడ్జెట్ విషయంలోనూ మార్పులొచ్చాయని మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం నాని తన 30 వ సినిమాతో బిజీగా వున్నాడు. ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా, ఈ సినిమా బడ్జెట్ కూడా పెరిగిందనీ అంటున్నారు. అది కూడా ‘దసరా’ ఇంపాక్ట్‌తోనే. ఇలా చెప్పుకుంటూ పోతే, నాని బడ్జెట్ స్కేల్ పెరిగిపోయింది. ఇమేజ్, స్టార్‌డమ్ రేంజ్ మారిపోయాయ్. సో, నాని ఇదివరకట్లా ఎవ్వరికీ అంత తేలిగ్గా దొరకట్లేదనీ ఇన్‌సైడ్ టాక్.