Nani: నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఏపీలోని టికెట్ల విషయంపై స్పందించి కిరాణాకొట్టులో వచ్చిన కలెక్షన్లు కూడా ఏపీ థియేటర్లో రావడంలేదని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపాయి.నాని ఏపీ ప్రభుత్వం పై ఇలా విమర్శలు చేయడంతో పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు నాని ని టార్గెట్ చేశారు. అదేవిధంగా నాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలు అయ్యాయి. ఇలా తన గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ రావడంతో మరోసారి నాని ఈ విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదని నేను ఒకటి చెబితే బయటకు మరొకటి వెళ్ళింది దాంతో ఇలాంటి వివాదం చోటు చేసుకుందని అసలు ఈ గొడవ వకీల్ సాబ్ సినిమాతోనే మొదలైందని అప్పుడే కనుక అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఈ విషయం గురించి చర్చించుకొని ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కాదని నాని తెలిపారు.
ఈ విధంగా సినిమా టికెట్ల పై నాని క్లారిటీ ఇస్తూ తను రాజకీయంగా మాట్లాడడం లేదని తనకు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. ఇలా నాని మరొకసారి సినిమా టికెట్ల విషయంపై స్పందిస్తూ తను వివరించడంతో ఆయన అభిమానులు నాని ధైర్యానికి ఫిదా అయ్యారు.ఇకపోతే ఈయన నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఈ సినిమాను ఆదరించినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.