బడే మీయాన్.. చోటే మీయాన్ అంటూ అలాంటి పోస్ట్ చేసినా నాని?

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన నటించిన అంటే సుందరానికి సినిమా విడుదలై పర్వాలేదనిపించింది. ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే నాని సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నాని ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్టు కె.ఈ సినిమా గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకోవడంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం హైదరాబాద్లో సందడి చేస్తున్నారు.

ఇక ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుండగా చిత్ర బృందానికి ప్రభాస్ పార్టీ ఇచ్చారు.అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆహ్వానించి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో దర్శకుడు రాఘవేంద్రరావు నాని, దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి పలువురు స్టార్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నాని అమితాబచన్ తో ఎంతో సరదాగా ముచ్చటించడమే కాకుండా ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

నాని అమితా బచ్చన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇది జరిగిపోయింది.. బడే మీయాన్.. చోటే మీయాన్ అంటూ స్మైలీ ఎమోజీ షేర్ చేశారు.ఇక ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అమితాబచ్చన్ ప్రాజెక్టు కే చిత్ర బృందంతో పాటు పలువురు చిత్ర బృందాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా రాఘవేంద్రరావు లెజెండ్.. ప్రభాస్ బాహుబలి, నాని ఓ స్టార్.. దుల్కర్ సల్మాన్ ఓ స్టార్ అంటూ అందరి గురించి చెబుతూ ట్వీట్ చేశాడు. ఇక అమితాబచ్చన్ చేసిన ఈ ట్వీట్ పై నాచురల్ స్టార్ నాని స్పందిస్తూ మోస్ట్ మెమరబుల్ సర్.. ఫ్యాన్ మూమెంట్ అంటూ రెడ్ హార్ట్ సింబల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.