నాని అంటే సుందరానికి భారీగా ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్థ?

నాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను కలిగేలా చేస్తున్నారు.

కరోనా కారణం వల్ల డిజిటల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి మనకు తెలిసిందే.ఒకప్పుడు సినిమాలు థియేట్రికల్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమాని శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసి బుల్లితెరపై ప్రసారం చేసేవారు. అయితే ప్రస్తుతం సినిమాలను డిజిటల్ మీడియా భారీ ధరలకు కొనుగోలు చేసి ఓటీటీలో విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే నాని నటించిన అంటే సుందరానికి సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక నాన్ థియేటర్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు తిరిగి విడుదల చేయనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని నాని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో అంటే సుందరానికి సినిమా ద్వారా కూడా హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంటారని తెలుస్తుంది.