Sudigali Sudheer: అందరి ముందు సుధీర్ పై తన ప్రేమను బయట పెట్టిన హీరోయిన్?

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధీర్ కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. సుడిగాలి సుదీర్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుధీర్ తో కలసి ట్రాక్ వర్కౌట్ చేసుకొని పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో వర్షిని, విష్ణు ప్రియ లాంటి వారు కూడా కెరీర్ మొదట్లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసి ఆ తర్వాత తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.

ఇది ఇలా ఉంటే నటి నందితా శ్వేత ఈ మధ్యకాలంలో బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నందితా శ్వేత చివరిగా అక్షర అనే సినిమాలో నటించింది సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె మళ్లీ బుల్లితెర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షోకీ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నందిత శ్వేతా కు అక్కడ పెద్దగా సెట్ కానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నందిత శ్వేత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కనిపించింది.

Sridevi Drama Company Latest Promo - Every Sunday @1:00 PM - #Etvtelugu - 23rd January 2022

ఈ క్రమంలోనే యాంకర్ సుడిగాలి సుధీర్ పై తనకున్న ప్రేమను అందరి ముందు బయట పెట్టేసింది. ఒకవేళ ఢీ షోలో కనుక సుధీర్ ఉంటే ట్రాక్ కలిపే వాళ్ళమేమో అంటూ సుధీర్ పై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ తన సినిమా టైటిల్ ను చెప్పేసింది ఈ బ్యూటీ. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సుడిగాలి సుదీర్ విషయానికి వస్తే జబర్దస్త్ కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా, మెజీషియన్ గా, డాన్సర్ గా తనలో ఉన్న ఒక్కొక్క టాలెంట్ తో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇప్పటివరకు బుల్లి తెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సుధీర్ ప్రస్తుతం వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇకపోతే సుధీర్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.