మరోసారి ఢీ షోలో మొదలైన ముద్దుల గోలా.. కంటెస్టెంట్ కి ముద్దు పెట్టిన నందిత!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో భాగంగా ప్రతి బుధవారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ తమ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హ్యాండీక్యాప్డ్ కంటెస్టెంట్ వన్ లెగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈయన ఒంటికాలితో ఎంతో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని డాన్స్ కి అందరు ఫిదా అయ్యారు.

ఇక ఈయన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడంతో చూసి ఆగ లేక పోయిన నందిత వేదికపైకి వచ్చి అతనిని గట్టిగా కౌగిలించుకొని అతని బుగ్గ పై ముద్దు పెట్టింది. ఈ విధంగా ఈమె ముద్దు పెట్టడంతో అక్కడినుంచి జానీ మాస్టర్ ఎంతో అసహనంగా భుజంపై కర్చీఫ్ వేసుకొని వెళ్లి పోతున్నట్టు చూపించారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది తనదైన శైలిలో జానీ మాస్టర్ పై పంచ్ వేశాడు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నందిత ఇలా కంటెస్టెంట్ లకు ముద్దు పెట్టడంతో నెటిజన్లు మరోసారి ఈ కార్యక్రమం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢీ కార్యక్రమంలో ఇదివరకు పూర్ణ నిత్యం కంటెస్టెంట్ ల బుగ్గ కొరుకుతూ వారికి ముద్దులు పెట్టే విషయం మనకు తెలిసిందే. అయితే పూర్ణ ఈ విధంగా కంటెస్టెంట్ లకు బుగ్గ కొరకడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో పెద్ద దరిద్రం తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే తాజాగా నందిత సైతం పూర్ణ గుర్తుకు వచ్చేలా కంటెస్టెంట్ లకు ముద్దు పెట్టడంతో మరోసారి ఈ కార్యక్రమంలో ముద్దుల గోల మొదలైంది రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.