Puspha Movie: పుష్ప పార్ట్ 2 లో నందమూరి హీరో.. తగ్గేదే లే అంటున్న సుకుమార్!

Puspha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప పార్ట్ 1 ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ పార్ట్ 2 పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అయ్యి, ఈ ఏడాది చివరికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప పార్ట్ 2 లో నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇదే కనుక నిజమైతే ఎంతో బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కి బాలకృష్ణ కుటుంబానికి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ నిర్వహిస్తున్న తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ అనే కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈయనతో బన్నీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం కారణంగానే అల్లు అర్జున్ బాలకృష్ణ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇలా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటంవల్ల సుకుమార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 2 లో ఓ కీలకమైన పాత్రలో సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.