Nagma: వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..?

Nagma: సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియక పోయినా అప్పట్లో టాప్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన తరువాత మధ్యలో అడపాదడపా పాత్రల్లో కనిపించి అలరించింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలలో అస్సలు కనిపించడం లేదు. సినిమాలకు బాయ్ బాయ్ చెబుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన టాలెంట్ను నిరూపించుకోవాలని తెగ ఆరాటపడింది. కానీ నగ్మా కు రాజకీయాలు అంతగా కలిసి రాలేదు. ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకుల మైమరిపిస్తుంది. ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత నగ్మా మళ్లీ నటించడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఈ తరం వారికి నచ్చినట్టుగా నటించడానికి రెడీ అయిందట. అసలు విషయంలోకి వెళ్తే ఈమె తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాళికాదేవి అనే పేరుతో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుందట. ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు విజయరాఘవన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ రాఘవన్ కేవలం నగ్మా కోసమే ఈ వెబ్ సిరీస్ ను రాసినట్లు తెలుస్తోంది. నగ్మా అంటే విజయరాఘవన్ కు అభిమానం అని, అభిమానం నచ్చడంతో నగ్మా కూడా నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ వ్యక్తికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ షూట్ లో నగ్మా తో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు అని సమాచారం.