Nagavamshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న నాగ వంశీ త్వరలోనే ఏకంగా మూడు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నాగవంశీ నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డం సినిమాని జులై 31వ తేదీ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి ఒక ప్రోమో వీడియో విడుదల చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారటమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమా తెలుగు హక్కులను వంశీ దక్కించుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన మాస్ జాతర సినిమా ఆగస్టు 27 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భాను భోగవరపు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అటు రవితేజ ఇటు భాను భోగవరపు ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది. నాగవంశీ ఈ మూడు సినిమాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయలు రిస్క్ లో పెడుతున్నారు. ఇలా నెల వ్యవధిలోనే మూడు సినిమాల ద్వారా నాగ వంశీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ మూడు సినిమాలు కనుక హిట్ అయితే ఈయనకు ఇండస్ట్రీలో తిరుగుండదని చెప్పాలి. ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది.
