Jagapathi babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా ఉన్నారు వరుసగా విలన్ పాత్రలలో నటిస్తూ ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్న జగపతిబాబు తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారికి సంబంధించిన విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ లో భాగంగా కింగ్ నాగార్జున హాజరయ్యారు నాగార్జునతో పాటు తన అన్నయ్య తన అక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున జగపతిబాబుకు సంబంధించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి అలాగే జగపతిబాబుని ఇప్పటికి తన ఇంటికి నాగార్జున ఎందుకు ఆహ్వానించారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఓసారి నాగార్జున తన ఇంట్లో అందరికీ ఘనంగా పార్టీ ఇచ్చారట అయితే జగపతిబాబు ఆ పార్టీలో కాస్త ఎక్కువగా డ్రింక్ చేసి నాన్న రచ్చ చేశారని తెలిపారు.
ఇలా జగపతిబాబు చేసిన అల్లరికి షాక్ అయిన నాగార్జున అప్పటినుంచి తన ఇంట్లో జరిగే ఏ పార్టీకి కూడా జగపతిబాబుకి ఇన్విటేషన్ ఉండదట. ఇక నాగచైతన్య పెళ్లికి కూడా ఆహ్వానించలేదని చెప్పడంతో నేను పిలవకపోయినా నువ్వు రావచ్చు కదా అంటూ నాగార్జున ప్రశ్నించారు. సిగ్గు లేకుండా నన్ను పెళ్లికి రమ్మంటావా అంటూ జగపతిబాబు తెలిపారు అంతేకాకుండా తనకు మరుసటి రోజు ఉదయమే షూటింగ్ ఉన్న నేపథ్యంలో పెళ్లికి రాలేకపోయానని తెలిపారు. ఓసారి నాగార్జున సినిమా ప్రీమియర్ కి పిలవడంతో బాలేదు అంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చారట. ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇవ్వటంతో నాగార్జున తన ఇంటికి భోజనానికి పిలిచి మరి జగపతిబాబుకు క్లాస్ పీకారట. అప్పటి నుంచి జగపతిబాబు ప్రీమియర్లకు వెళ్లడమే మానేశారని వెల్లడించారు.
