టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మిస్సైన మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే?

ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ గా కనిపించే టాలీవుడ్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకునే స్టార్ హీరోగా నాగార్జునకు పేరుంది. తను హీరోగా నటించిన పలు సినిమాల ద్వారా నాగార్జున ఎంతోమంది డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చారు. త్వరలో నాగార్జున 100 చిత్రాల మైలురాయిని అందుకోనున్నారు,.

ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను నాగ్ సొంతం చేసుకున్నారు. నాగార్జున సినీ కెరీర్ లో పలు సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి. నాగ్ నటించిన నిన్నే పెళ్లాడతా, శివ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అయితే మూడు సినిమాలు మాత్రం ఇండస్ట్రీ హిట్లుగా నిలిచే ఛాన్స్ ఉన్నా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాయి.

ఇండస్ట్రీ హిట్లు అయ్యే సత్తా ఉన్నా మూడు సినిమాలు మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయాయి. నాగ్ నటించిన సినిమాలలో ఆఖరి పోరాటం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఆఖరి పోరాటం 100 రోజులు కేవలం 7 కేంద్రాలలో మాత్రమే ఆడటం గమనార్హం. అయితే నాగ్ కు కమర్షియల్ హీరోగా ఈ సినిమాతో గుర్తింపు దక్కింది. పసివాడి ప్రాణం రికార్డులను బ్రేక్ చేయలేకపోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు.

నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన హలో బ్రదర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇతర హీరోల పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్నా థియేటర్లను కోల్పోయింది. ఘరానా మొగుడు సినిమా వల్ల ఈ సినిమాకు నష్టం జరిగింది. నువ్వు వస్తావని సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కావడం కొంతలో మిస్ అయింది.

నువ్వు వస్తావని విజయవంతంగా ప్రదర్శిస్తున్న సమయంలోనే నిన్నే ప్రేమిస్తా సినిమా విడుదల కావడంతో థియేటర్లను కోల్పోయి ఈ సినిమా ఇబ్బందులను ఎదుర్కొంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 14 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ విధంగా తన కెరీర్ లో వేర్వేరు కారణాల వల్ల మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యే అవకాశాన్ని మాత్రం కోల్పోవడం గమనార్హం.