ప్రదీప్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం నాగార్జునానే.. ప్రదీప్ సంచలన వ్యాఖ్యలు..!

బుల్లితెర మీద సందడి చేస్తున్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకరు. బుల్లితెర ప్రేక్షకులలో ప్రదీప్ ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రదీప్ కి లేడి ఫాలోయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా యాంకర్ గా సందడి చేస్తున్న ప్రదీప్ స్టేజి మీదకు వస్తే చాలు అక్కడ వాతావరణం సందడిగా మారిపోతుంది. ప్రదీప్ సొంత ప్రొడక్షన్ లో వచ్చిన “కొంచం టచ్ లో ఉంటే చెప్తా” అనే షో ద్వార బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా ప్రస్తుతం ఈటీవి లో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా ప్రదీప్ చాలా కాలంగా యాంకర్గా కొనసాగుతున్నాడు.

ప్రదీప్ యాంకర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. జులాయి, అత్తారింటికి దారేది , 100% లవ్ వంటి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించటం ఎలా ” సినిమా ద్వార హీరోగా మారాడు. అయితే వెండితెర ప్రదీప్ కి అంతగా కలసిరాలేదు. అందువల్ల మళ్లీ బుల్లితెర మీద ఫోకస్ పెట్టాడు. ఇలా యాంకర్ గా ఫేమస్ అయిన ప్రదీప్ ఎంతోమందికి సాయం చేసి ఎన్నో సందర్భాలలో తన మంచి మనసు కూడా చాటుకున్నాడు. ఇదిలా ఉండగా ఎప్పుడు చూసినా , ఏ షో కి వెళ్ళిన ప్రదీప్ పెళ్లి గురించి మాట్లాడుతూ.

లైఫ్ లో సక్సెస్ అయిన ప్రదీప్ పెళ్లికి మాత్రం దూరంగా ఉంటున్నాడు. అందుకు గల కారణం అడిగితే నాగార్జున గారు చెప్పిన డైలాగ్ ఫాలో అవుతున్నా అని సమాధానం చెబుతాడు. ప్రదీప్ పెళ్లికి నాగర్జున గారికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మన్మధుడు సినిమాలో నాగార్జున గారు పెళ్లంటే నూరేళ్ళ మంట రా అని ఒక డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ప్రదీప్ కూడా ఆ డైలాగ్ ఫాలో అవుతూ పెళ్ళి కి దూరంగా ఉంటున్నాడని సమాచారం. ఇప్పటికి ప్రదీప్ బుల్లితెర యాంకర్ల లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అంతేకాకుండా రజినీకాంత్ చెప్పిన సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ కూడా ప్రదీప్ బాగా ఫాలో అవుతాడు.